ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు విద్యార్థులకు లాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. తానా ఫౌండేషన్ ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోందని, కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మెడికల్ కిట్‌లు, అంబులెన్స్ సర్వీస్‌లు కల్పించిందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరింత అభివృద్ధి చెంది విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లాప్‌టాప్‌లు పంపిణీ - narasaraopeta mp
గుంటూరులో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేద విద్యార్థులకు లాప్‌టాప్‌లు అందించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లాప్‌టాప్‌లు పంపిణీ