Lanka dinakar Fire on AP Govt: వైకాపా ప్రభుత్వం రియల్టర్ అవతారం ఎత్తి.. రాజధాని భూములకు తాకట్టు పెట్టాలని చూస్తుందని భాజపా నేత లంకా దినకర్ ఆరోపించారు. అందుకే ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని న్యాయస్థానం నుంచి వెనక్కి తీసుకుందని అన్నారు. సీఆర్డీఏ చట్టం మనుగడలో ఉంటేనే ఇది సాధ్యపడుతుందని.. అందుకే ఆ చట్టాన్ని పునరుద్ధరించారని పేర్కొన్నారు.
భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టేందుకు వీలుగా గ్రామాల విభజన చేపట్టారా అని అన్నారు. అమరావతి గ్రామాల మధ్య అంతరాన్ని సృష్టించి ఉద్యమ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు తాజాగా అమరావతి నగరపాలక సంస్థ ఏర్పాటు పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. ప్లాట్ల అమ్మకంతో నవులూరు భూములకు నూకలు చెల్లాయని తెలిపారు. మూడు రాజధానులని బొత్సతో మళ్లీ చెప్పించడం మోసం కాదా? అని ప్రశ్నించారు.