వైకాపా అధ్యక్షుడు జగన్ చెప్పేవన్నీ అసత్యాలే అని తెదేపా నేత లంకా దినకర్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకపోగా రాష్ట్రానికి వచ్చిమోదీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దు తర్వాత ఏటీఎం అంటే 'ఎనీ టైమ్ నో మనీ' అయిందని ఎద్దేవా చేశారు. క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తులు క్రూరంగానే ప్రవర్తిస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగానూ సరిపోరన్నారు. నియంత పోకడలు ఉన్న జగన్, మోదీకి ప్రజలు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. ఓటు అనే ఆయుధంతో రాజ్యాంగబద్ధంగా మోదీ, జగన్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. ఫెడరల్ ఫ్రంట్‌లో కేసీఆర్, జగన్ తప్ప ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి..