ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా భూమి మాకివ్వండి.. లేదంటే ఆత్మహత్యే శరణ్యం..!' - land problem news in ganapavaram

తాము యాభై ఏళ్లుగా సాగు చేసుకునే భూమిని ఇళ్ల స్థలాల కోసం తీసుకుంటే జీవనాధారం ఉండదంటూ గుంటూరు జిల్లా నక్కలవారిపాలేనికి చెందిన మహిళా రైతులైన తల్లీకూతుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఆ కాస్త భూమిని లాక్కుంటే మగదిక్కు లేని తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ వాపోయారు.

పురుగులమందు డబ్బాతో పొలంలో బైఠాయించిన తల్లీకూతుళ్లు
పురుగులమందు డబ్బాతో పొలంలో బైఠాయించిన తల్లీకూతుళ్లు

By

Published : Feb 23, 2020, 11:23 PM IST

పురుగులమందు డబ్బాతో పొలంలో బైఠాయించిన తల్లీకూతుళ్లు

గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన పేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు ఎకరా ఆరు సెంట్ల భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చదును చేసి రోడ్లు వేశారు. హద్దులు నిర్ణయించి రాళ్లు వేసేందుకు వచ్చిన సిబ్బందిని అక్కడి మహిళా రైతులైన తల్లీకూతుళ్లు నాగేంద్రమ్మ, భూలక్ష్మి అడ్డుకున్నారు. 50 ఏళ్ల క్రితం తాము ఈ భూమిని కొన్నామని అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నామని అధికారులకు తెలిపారు. ఇప్పుడు ఉన్న ఆ కాస్తంత భూమిని స్వాధీనం చేసుకోవడం తగదన్నారు. అలా చేస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని గత రెండు రోజులుగా రాత్రీ పగలు అని తేడా లేకుండా పురుగుల మందు డబ్బా పట్టుకొని పొలంలోనే బైఠాయించారు.

ఇదీ చూడండి:

పేదోడి భూమి లాక్కొని.. పేదలకు ఇవ్వడమేంటి..?

ABOUT THE AUTHOR

...view details