గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్డీఏ ఉప కలెక్టర్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. మధ్యవర్తులతో కలసి తమ భూమిని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారంటూ.. కొందరు ఉప కలెక్టర్ తీరుపై నిరసన తెలిపారు. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 2015లో ఓ మధ్యవర్తితో కలసి నేలపాడులో ఇస్సాకు అనే వ్యక్తి వద్ద ఎకరా భూమి కొనుగోలు చేశానని.... 2019లో తనకు తెలియకుండా మధ్యవర్తులు అమ్మేశ్వర్, కృష్ణారావు, డిప్యూటి కలెక్టర్ బినామి గ్లోరియా రాజశేఖర్ రెడ్డి కలిసి తన భూమిని కబ్జా చేశారని వెంకట్రావు అనే వ్యక్తి ఆరోపించారు. మధ్యవర్తి అమ్మేశ్వర్ సహాయంతో తన భూమిని ల్యాండ్ పూలింగ్ ఇచ్చి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెంకట్రావు తెలిపారు. తనకు న్యాయం చేయకపోతే సీఆర్డీఏ కార్యాలయం వద్దే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
''అది నా భూమి.. ఇవ్వకుంటే ఆమరణ దీక్షకు దిగుతా'' - భూకబ్జా
గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్డీఏ ఉప కలెక్టర్, మధ్యవర్తులు కలసి తమ భూమిని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారంటూ.. కొందరు నిరసన తెలిపారు. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బాధిత కుటుంబం