ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూ వివాదంలోకి దేవుడొచ్చాడు! - కాకుమానులో భూవివాదం వార్తలు

ఓ స్థలం కోసం ఏళ్ల తరబడి రెండు వర్గాలు ఘర్షణ పడుతున్నాయి. స్థలం తమదే అంటూ ఒకరు కంచె వేస్తే... మరొకరు ఆ స్థలంలో ఏకంగా దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

land-issue-in-kakumanu-guntur-district
land-issue-in-kakumanu-guntur-district

By

Published : Jan 2, 2020, 8:26 AM IST

'భూ వివాదంలోకి దేవుడొచ్చాడు'

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు పంచాయతీకి చెందిన స్థలం.. వివాదానికి కేంద్రంగా నిలుస్తోంది. ఈ భూమిపై 2 వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఇటీవల ఒక వర్గానికి చెందిన వారు.. అధికారులను కలిసి ఆ స్థలం తమదేనంటూ స్థలం చుట్టూ ఇనుప కంచె వేశారు. అది చూసిన మరో వర్గం.. రాత్రికి రాత్రి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆ స్థలంలో ప్రతిష్టించింది. విషయం తెలుసుకున్న అధికారులు విగ్రహాన్ని తొలగించి పక్కనే ఉన్న దేవాలయంలో పెట్టేందుకు ప్రయత్నించారు. గ్రామస్థులు అడ్డుకున్న కారణంగా.. విగ్రహాన్ని ఆటోలో వేరే ప్రాంతానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details