మాటువేసి దోచేస్తున్న నిందితులు ద్విచక్రవాహనంలో ఉంచిన రూ. 9 లక్షల నగదు అపహరణకు గురైనట్లు గుంటూరు నగరంలోని లాలాపేట ఠాణాలో నిన్న ఫిర్యాదు నమోదు కాగా.. పోలీసుల దర్యాప్తులో కీలకమైన సీసీ కెమెరా ఫుటేజ్ లభించింది. బాధితుడు ద్విచక్రవాహనంలో పెట్టిన నగదును ఓ వ్యక్తి అపహరించినట్లు అందులో కనిపిస్తోంది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.
సంబంధిత కథనం:నదిలో చిక్కుకున్న ట్రాక్టర్- జవాన్ల సాయంతో ఒడ్డుకు
గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన సుంకర ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి.. స్థానిక మిర్చియార్డులో ఓ కమీషన్ వ్యాపారి వద్ద గుమాస్తాగా పని చేస్తున్నాడు. శుక్రవారం వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నంబజారులోని సిటీ యూనియన్ బ్యాంకులో రూ. 9 లక్షల నగదు డ్రా చేసి బ్యాగ్‌ను తన ద్విక్రవాహనంలో భద్రపరిచాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పురుగుమందుల బజారులో టిఫిన్ చేసి దుకాణానికి వెళ్లాడు. అనంతరం వాహనంలో పెట్టిన నగదు కోసం చూడగా కనిపించలేదు. ఎవరో అపహరించారని గ్రహించిన బాధితుడు.. లాలాపేట పోలీసులను ఆశ్రయించాడు.
సంబంధిత కథనం:
బైక్‌లో పెట్టిన 9 లక్షలు మాయం.. అసలేమైంది..?