Yadadri Lakshmi narasimha swamy Adhyayana Utsavam: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో ఈనెల రెండున ప్రారంభమైన అధ్యయనోత్సవాలు నేటితో ముగిశాయి. ఆరు రోజుల పాటు వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు.. చివరి రోజు లక్ష్మీనరసింహస్వామి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిలిచిన సాధారణ పూజా కార్యక్రమాలను ఆదివారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి అవతార విశిష్టతను ఆలయ అర్చకులు తెలిపారు.
యాదాద్రిలో వైభవంగా ముగిసిన అధ్యయనోత్సవాలు - యాదాద్రిలో అధ్యయనోత్సవాలు
Yadadri Lakshmi narasimha swamy Adhyayana Utsavam: తెలంగాణ యాదాద్రిలో ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. రోజుకొక అవతారంలో దర్శనమిచ్చిన స్వామి వారు.. చివరి రోజైన శనివారం లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. ఇక భద్రాచలంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
Yadadri Lakshmi narasimha swamy Adhyayana Utsavam
ఇక భద్రాచలంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని తిరుప్పావై ప్రవచనాలు చదువుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు సరస్వతీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఇవీ చదవండి: