గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన పాలేటి రాధిక (33), విద్యానగర్‌కు చెందిన పాలేటి అనిల్ కుమార్ 15 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు సంవత్సరాలుగా అనిల్ కుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్య రాధికను వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కుమార్తె చావుకు భర్త అనిల్ కుమార్‌తో పాటు అతని తల్లి రమాదేవి, సోదరి శ్రీలత కారణమని రాధిక తల్లి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టాభిపురం ఎస్సై మహిత తెలిపారు.
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య - guntur district latest news
భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతి చెందిన రాధిక