గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో యువతి ఏనుముల భవాని(18) అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. యువతి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తల్లిదండ్రులు ఏనుముల సత్యం, సుజాత చెబుతున్నారు. అయితే రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా యువతి అంత్యక్రియలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు.
అనారోగ్య సమస్య వల్లే..
గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు ఎందుకు చేశారని.. పోలీసులు అడిగిన ప్రశ్నకు తల్లిదండ్రులు నుంచి సరైన సమాధానం రాలేదు. కడుపునొప్పి కారణంగా ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది.
lady mystery death: యువతి అనుమానాస్పద మృతి.. - ముట్లూరు యువతి అనుమానస్పద మృతి
ఓ యువతి పెట్రోల్ పోసుకుని మృతి చెందింది. తల్లిదండ్రులు, బంధువులు ఆమె అంత్యక్రియలను గుట్టుచప్పుడుకాకుండా రాత్రికి రాత్రే నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. వారు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు.
![lady mystery death: యువతి అనుమానాస్పద మృతి.. విచారణ చేస్తున్న పోలీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12737131-897-12737131-1628657876489.jpg)
విచారణ చేస్తున్న పోలీసులు
Last Updated : Aug 11, 2021, 11:09 AM IST