ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆస్తి ఇవ్వకపోతే పురుగులమందు తాగమన్న కుమార్తె' - harasments of parents by daughter in guntur dst

ఆస్తికోసం తల్లిదండ్రులను వేధిస్తోంది ఓ మహిళా కానిస్టేబుల్.. ఆ వృద్ధులపై దాడిచేయటమే కాకుండా వారిని చనిపోమ్మని పురుగుల మందు సీసా ఇచ్చి మానసికంగా చంపేసింది. కట్టుకున్న భర్తతో కలిసి కన్నవాళ్లను వేధిస్తోన్న గుంటూరు జిల్లా పెదకాకాని మహిళా కానిసేబుల్ ఫాతిమాపై ఆమె తల్లిందండ్రులు ఏమంటున్నారో మీరే చూడండి..

lady-constable-harass-her-parents-for-property-in-guntur-dst
lady-constable-harass-her-parents-for-property-in-guntur-dst

By

Published : Aug 10, 2020, 2:00 PM IST

కుమార్తె వేధింపులను చెబుతున్న తల్లిదండ్రులు

గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్​లో మహిళా కానిస్టేబుల్​గా పనిచేస్తున్న ఫాతిమాపై ఆమె తల్లిదండ్రులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం తమని వేధిస్తోందని ఫాతిమా తండ్రి ఖాసిం సైదా వాపోయారు. సైదా మొదటి భార్యకు పిల్లలు లేకపోవటంతో రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. రెండో భార్య మరణించింది. ఆమె పిల్లలిద్దరికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. వృద్ధాప్యం కారణంగా సేద్యం చేసే పరిస్థితి లేకపోవటంతో తనకున్న ఎకరంన్నర పొలాన్ని ఖాసిం వేరే వాళ్లకు విక్రయించాడు.

అయితే పొలం అమ్మేందుకు వీల్లేదని... అది తన పేర రాయాలని కుమార్తె ఫాతిమాతో పాటు ఆమె భర్త ఒత్తడి తెస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఆస్తిఇవ్వకపోతే పురుగులమందు తాగా చనిపోమని సీసా ఇచ్చిందని ఆమె పినతల్లి మస్తాన్ భీ ఆవేదన వ్యక్తం చేసింది. సైదా తన మొదటి భార్యతో కలిసి గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయానికి వచ్చి అక్కడ ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details