తమ హోటల్‌ను ఓ వైకాపా నాయకుడు ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ... గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన మహిళా గ్రామీణ ఎస్పీని ఆశ్రయించింది. గత 40 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న హోటల్‌ను వైకాపా నేత చేరెడ్డి కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని గ్రామానికి చెందిన కొత్తపల్లి మాలతి ఆరోపించారు. న్యాయం చేయాలంటూ గ్రామీణ ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌ను ఆశ్రయించారు.
ఇటీవల హోటల్ పునఃనిర్మించడానికి ప్రయత్నించగా... కృష్ణారెడ్డి అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. రెవెన్యూ, పోలీసు సిబ్బందిని పంపించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని..., స్థానిక ఎస్సైకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోయింది. పెద్ద మనుషులు పంచాయితీకి పిలిస్తే..."నా గురించి ఆ అమ్మాయి ఏదైనా ఆలోచిస్తే...న్యాయం చేస్తాను" అంటూ కృష్ణా రెడ్డి ద్వంద అర్థాలతో మాట్లాడుతున్నాడని ఆరోపించింది. తమకు హోటలే ఆధారమని...,పోలీసులు స్పందించి న్యాయం చేయాలని వేడుకొంటుంది.