రోడ్ల పక్కన, బస్ షెల్టర్లలో, ఫుట్ పాత్లపై ఉంటూ అన్నదాతల కోసం ఎదురుచూస్తున్నారు రోజువారి కూలీలు. ఎవరైనా ఆహారం పొట్లాలు పంచేందుకు వస్తే ఆ వాహనం వెంట పరుగులు తీస్తున్నారు. దాతలు తెచ్చిన భోజనం అయిపోతే నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇలాంటి వారి కోసం గుంటూరు నగరపాలక సంస్థ 6చోట్ల షెల్టర్లు ఏర్పాటు చేసింది. అయితే అక్కడ నిండిపోవటంతో చాలామంది ఇంకా బయటే ఉంటున్నారు. దాతలిచ్చే భోజనంతో కడుపు నింపుకొంటున్నారు. పోలీసుల ఆంక్షలు వీరికి ఇబ్బందిగా మారాయి. అమ్మ పెట్టనివ్వదు అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా అధికారుల వైఖరి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారి కూలీలతోపాటు ఏ పని చేయలేక బిక్షాటన చేసుకునే వారికి కూడా తిండికోసం కష్టాలు తప్పటం లేదు.
అన్నదాతల కోసం.. ఎదురుచూపులు - గుంటూరులో ఆహార ఇబ్బందులు
కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన రోజువారి కూలీలు ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు నగరంలో హోటళ్లు, లాడ్జీలలో పనిచేసే వారు... నిర్మాణ పనుల కోసం వెళ్లే కూలీలు పూట గడవక పస్తులుంటున్నారు.
![అన్నదాతల కోసం.. ఎదురుచూపులు అన్నదాతల కోసం.. ఎదురుచూపులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7246102-904-7246102-1589816257378.jpg)
అన్నదాతల కోసం.. ఎదురుచూపులు