ఎస్సీ, ఎస్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చామని గొప్పగా చెప్పుకునే వైకాపా ప్రభుత్వం.. దళితలకు అన్యాయం చేస్తుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమోహన్ పేర్కొన్నారు. దళిత, గిరిజన బిడ్డలకు న్యాణమైన చదువులు అందిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్(బీఏఎస్)ను రద్దును నిరసిస్తూ... గుంటూరులో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుంటూరు లాడ్జి సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విధానాన్ని రద్దు చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది దళిత, గిరిజన విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీఏఎస్ స్కీమ్‌పై పునరాలోచన చేయాలని.. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని కృష్ణమోహన్ హెచ్చరించారు.