ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రుణాలు ఇప్పటివరకు లబ్ధిదారులకు అందలేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి గుంటూరు జిల్లా కార్యదర్శి కృష్ణ మోహన్ అన్నారు. తక్షణమే లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిన రుణాల ఉసే లేదని గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లబ్ధిదారులు పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్లో ఎన్ఎస్ఎఫ్డీసీ/ఎన్ఎస్కెఎఫ్డీసీ పథకం క్రింద జిల్లాలో 150 మందిని అర్హులుగా ప్రకటించి వారికి రుణాలు మంజూరు చేసిందన్నారు. ఖాతాలో నగదు జమ అవుతుందనుకునే సమయంలో ఎన్నికల కోడ్ రావడం వల్ల నిలిచిపోయాయని తెలిపారు. తమ సమస్యలని పరిష్కరించాలని పలుమార్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లామని, సంబంధిత శాఖ అధికారులను కలసిన లాభం లేకుండా పోయిందని వాపోయారు.