SUICIDE ATTEMPT: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం..ఎందుకంటే..? - canal

10:53 August 27
మామ వేధింపులే కారణమా?
మామ వేధింపులు భరించలేక విజయవాడకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన జాలర్లు..మహిళ, ఇద్దరు పిల్లలను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
తన భర్త అనారోగ్యంతో మంచానపడితే.. మామయ్య నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళ తెలిపింది. వేధింపుల తీవ్రత పెరగడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన మామ నుంచి తనను, పిల్లలను కాపాడాలని ఆమె కోరారు.
ఇదీ చదవండి:గుంటూరులో ఆ నలుగురు మైనర్లు ఏమయ్యారు..!