ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉక్కు ప్రైవేటీకరించొద్దంటూ మహిళల నిరాహార దీక్ష

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దంటూ కృష్ణా జిల్లా మహిళలు మందదడంలో నిరాహార దీక్ష చేపట్టారు. జగన్​ సీఎం అయిన తరువాత అన్నీ గోవింద అవుతున్నాయంటూ వినూత్నంగా నిరసన చేపట్టారు.

By

Published : Feb 9, 2021, 9:00 PM IST

agitation at amaravathi by women against visaka steel privatisation
విశాఖ ఉక్కు ప్రైవేటీకరించొద్దంటూ మహిళల నిరాహార దీక్ష

విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రకటించడంపై రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు రెండో రోజు నిరాహార దీక్షలు కొనసాగించారు. కృష్ణా జిల్లాకు చెందిన మహిళలు మందదడంలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్​ పర్సన్ గద్దె అనురాధ దండలు వేసి దీక్షలో కూర్చోపెట్టారు.

దీక్ష ముగిసిన అనంతరం మందడం మహిళలు పళ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. పరిపాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ 420వ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ గోవింద అయ్యాయంటూ.. మందడం మహిళలు వినూత్న రీతిలో నిరసనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details