ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంటైన్మెంట్ జోన్​గా.. కొత్తపేట @ సత్తెనపల్లి - సత్తెనపల్లిలో కరోనా వైరస్

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో మృతి చెందిన వ్యక్తికి పట్టణంలో అంత్యక్రియలు జరిపారు. మృతునికి కొవిడ్ పాజిటివ్ అని తేలడంపై.. అధికారులు పట్టణంలోని కొత్తపేట ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు.

kothapeta as containment zone in satthenapalli guntur district
కంటైన్మెంట్ జోన్​గా కొత్తపేట

By

Published : Jun 7, 2020, 8:34 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని కొత్తపేట ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. గత మంగళవారం తెలంగాణలోని మిర్యాలగూడలో మరణించిన కొత్తపేట వాసికి అతని స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. మృతుని రక్త నమూనాలను పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అప్రమత్తమైన అధికారులు.. అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రైమరీ కాంటాక్ట్స్ ఇద్దరికి కొవిడ్ సోకినట్లు నిర్ధారించారు.

ఫలితంగా ఈ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. బయటి వారు లోనికి రాకుండా, లోపలి వారు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానికులెవరూ బయటకు రాకూడదని... నిత్యావసర వస్తువులను వాలంటీర్లతో సరఫరా చేయిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details