ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటప్పకొండ త్రికోటేశ్వరుని హుండీ ఆదాయం రూ.1.69 కోట్లు - కోటప్పకొండ త్రికోటేశ్వరుని హుండీ ఆదాయం

కోటప్పకొండ త్రికోటేశ్వరుని హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భక్తులు రూ.1,69,36,870 కానుకల రూపంలో సమర్పించారు.

కోటప్పకొండ త్రికోటేశ్వరుని హుండీ ఆదాయం రూ.1.69 కోట్లు
కోటప్పకొండ త్రికోటేశ్వరుని హుండీ ఆదాయం రూ.1.69 కోట్లు

By

Published : Mar 3, 2022, 10:16 PM IST

మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భక్తులు త్రికోటేశ్వరునికి రూ.1,69,36,870 కానుకల రూపంలో సమర్పించారు. బుధవారం ఆలయాధికారుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.73,07,721 నగదు, 28.3 గ్రాముల బంగారం, 1,125 గ్రాముల వెండి కానుకల రూపంలో భక్తులు సమర్పించుకున్నారు.

పూజ టిక్కెట్ల రూపంలో రూ.64,36,981, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.30,33,840, ఇతర ఆదాయాల ద్వారా రూ.1,58,328 సమకూరినట్లు అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది రూ.28,26,923 అదనంగా ఆదాయం లభించినట్లు ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపును దేవాదాయశాఖ ఇన్​స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఈవో, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు.

ABOUT THE AUTHOR

...view details