గుంటూరు జిల్లా కోటప్పకొండలో ఈ నెల 11వ తేదీన నిర్వహించిన తిరునాళ్ల వేడుకలను అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేశారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాష్ నగర్లోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోటప్పకొండ తిరునాళ్ల విజయోత్సవ సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచాయని గోపిరెడ్డి అన్నారు.
'అధికారుల సమన్వయంతోనే కోటప్పకొండ తిరునాళ్లు విజయవంతం' - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా కోటప్పకోండలో తిరునాళ్ల వేడుకలను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేశారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పోలీస్ సిబ్బందికి లక్ష రూపాయలను బహుమతిగా అందించారు.
లక్షరూపాయల బహుమతిని అందిస్తున్న ఎమ్మెల్యే
కొండ దిగువ భాగాన భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా డివైడర్లు ఏర్పాటు చేశామన్నారు. కొన్నేళ్లుగా కోటప్పకొండలో జరుగుతున్న తిరునాళ్లకు ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య కలుగుతోందన్న ఆయన... ఈ సంవత్సరం దాన్ని సవాలుగా తీసుకొని ట్రాఫిక్ సమస్యను నివారించామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో నరసరావుపేట డీఎస్పీ, పోలీసు సిబ్బంది ప్రముఖ పాత్ర పోషించారని గోపిరెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపి లక్ష రూపాయలు బహుమతిగా అందజేశారు.