ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కోటప్పకొండ విద్యుత్తు ప్రభలు 30 అడుగులు మించకూడదు' - గుంటూరు జిల్లా కోటప్పకొండ వద్ద విద్యుత్తు ప్రభలు వివాదం

శివుడు జ్ఞానోపదేశమిచ్చిన పవిత్రపుణ్యక్షేత్రం గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ. శివరాత్రి రోజు అక్కడ జరిగే తిరునాళ్లలో ప్రభల వెలుగులు కనిపించడం అనుమానంగా మారింది. గతంలో జరిగిన కొన్ని ఘటనలు.. కరోనా పేరుతో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. శివరాత్రి నేపథ్యంలో నిర్మించే ప్రభలు 30అడుగులు మించకుండా ఉండాలని నిర్వహకులకు స్పష్టం చేశారు. ప్రతి ఏడాది 50 నుంచి 100 అడుగుల ఎత్తులో ఉండే విద్యుత్తు ప్రభలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వెలుగులీనుతూ కనిపిస్తాయి. ఇప్పుడు పరిస్థితి మారింది.

kotappakoda prabhalu controversy
పోలీసుల ఆంక్షలు

By

Published : Feb 28, 2021, 5:42 PM IST

గుంటూరు జిల్లా కోటప్పకొండ వద్ద విద్యుత్తు ప్రభలు నిర్మించే.. చిలకలూరిపేట ప్రాంత నిర్వాహకులు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్థానిక పోలీసులు తెలిపారు. మహాశివరాత్రి నేపథ్యంలో తిరునాళ్లకు ప్రభలు నిర్మించే కావూరు , మద్దిరాల, అప్పాపురం, అమీన్ సాహెబ్ పాలెం, కమ్మవారిపాలెం, యడవల్లి గ్రామాల వారితో సీఐ సుబ్బారావు సమావేశమయ్యారు. 30 అడుగుల మించకుండా ప్రభలు నిర్మించుకోవాలని నిర్వాహకులకు చెప్పారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని వివరించారు. తిరునాళ్లలో అసభ్యకరమైన పాటలు.. అశ్లీల నృత్యాలు.. కుల, మత, వర్గాలకు సంబంధించిన గీతాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలు భక్తితో శివరాత్రి ఉత్సవాలు జరుపేవిధంగా కోటప్పకొండ ప్రభలు నిర్మించాలని సీఐ కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details