గుంటూరు జిల్లా కొప్పర్రులో మాజీ జడ్పీటీసీ శారదా ఇంటిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టడం దారుణమని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి పెదరత్తయ్య అన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రం, గ్రామాలకు మంచిది కాదని నేతలన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా.. ఇంట్లో ఉన్న బాధిత వర్గంపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలన్నారు. మాజీ జడ్పీటీసీ శారదా ఇంటికి నిప్పుపెట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు.
KOPPARRU: 'అలాంటి ఘటనలు ఏ మాత్రం మంచిది కాదు' - ఎంపీ గల్లా జయదేవ్
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో తెదేపా, వైకాపా వర్గాల ఘర్షణలో మాజీ జడ్పీటీసీ శారదా ఇంటికి నిప్పు పెట్టిన ప్రాంతాన్ని ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి పెదరత్తయ్య పరిశీలించారు. ఇలాంటి ఘటనలు జరగడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు.
![KOPPARRU: 'అలాంటి ఘటనలు ఏ మాత్రం మంచిది కాదు' ఎంపీ గల్లా జయదేవ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13298558-71-13298558-1633692460334.jpg)
ఎంపీ గల్లా జయదేవ్
హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం వల్ల ప్రత్యేకంగా ఆమెనే దృష్టి పెట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ATTACK : మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి.. ఆరు ద్విచక్రవాహనాలు దగ్ధం