ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండుబొట్లపాలెం పాఠశాలకు ఉమ్మారెడ్డి తల్లిదండ్రుల పేరు - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుబొట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉమ్మారెడ్డి వెంకయ్య, కోటమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా నామకరణం చేశారు. శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు..తల్లిదండ్రులు స్మారకంగా పాఠశాల అభివృద్ధికి సాయం అందించారు. నామకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Kondubotlapalem zph  school
Kondubotlapalem zph school

By

Published : Nov 11, 2020, 5:17 PM IST

మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని కొండుబొట్లవారిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఉమ్మారెడ్డి వెంకయ్య, కోటమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా నామకరణం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తన తల్లిదండ్రుల పేరు మీద పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించారు. ఇవాళ నామకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రంగనాథరాజు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పెద్ద రాజకీయ హోదాల్లో ఉన్న చంద్రబాబు, ఇతరులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. వారి పిల్లలు మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చినవారు మాత్రం ఆంగ్లమాధ్యమంలో చదువుకోకూడదనే వారి ఆలోచనపై ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలని తెలియజేశారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు విద్యాశాఖను నత్తనడకన నడిపించాయని, మూడు వేల కోట్ల బకాయిలు ఉంచారన్నారు. ఆరు నెలలకు ఒకసారి విద్యాశాఖలో జీతాలు చెల్లించే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదన్నారు. చదువుతోనే పురోభివృద్ధి సాధిస్తారని సీఎం జగన్ నాడు నేడు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. గృహ నిర్మాణశాఖ మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ ఉమ్మారెడ్డి చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని చదువుకున్న పాఠశాలకు సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details