ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండవీడు కోట అభివృద్ధికి అటవీశాఖ సమాయత్తం - అటవీశాఖ కొండవీడు పోర్టు అభివృద్ధి వార్తలు

గుంటూరు జిల్లాలోని ప్రముఖ చారిత్రక ప్రాంతం కొండవీడు కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. కొండవీడు కోటలో కోటిన్నర రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. ఎంతో ఘనమైన చరిత్రను భావితరాలకు తెలియజెప్పే లక్ష్యంతో అక్కడ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుతో పాటు... పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమైంది.

Kondaveedu fort
Kondaveedu fort

By

Published : Nov 11, 2020, 11:25 PM IST

ఎత్తైన కొండలు... పచ్చని అందాలు... ప్రకృతి సోయగాల నడుమ సగర్వంగా కనిపిస్తున్నదే కొండవీడు కోట. గుంటూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది. ఎంతో పురాతనమైన ఈ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో చర్యలు మొదలుపెట్టారు. కొండపైకి చేరుకునేందుకు రహదారి నిర్మాణంతో పాటు శిథిలమైన కట్టడాలను పునరుద్ధరించారు. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయాయి. కొండవీడు కోట అంతా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండటంతో అక్కడ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అటవీశాఖ అధికారులు. 1.50 కోట్ల రూపాయలతో రూపొందించిన డీపీఆర్​కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. నిధులు కూడా మంజూరు చేసింది. దీంతో అక్కడ పర్యాటకంగా సౌకర్యాలు కల్పించేందుకు అటవీశాఖ సమాయత్తమైంది.

ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి

నేటి తరాలకు కొండవీడు కోట వైభవాన్ని చాటేలా... అక్కడ పనులు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొండపైన ఉన్న చెరువుల చుట్టూ నడకదారులు ఏర్పాటు చేయనున్నారు. సేద తీరేందుకు బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణానికి హాని చేయని రీతిలో ఇక్కడ నిర్మాణాలు కలపతోనే ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులు కొండవీడు అందాలు తిలకించేందుకు ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. త్వరలో వీటన్నింటికీ సంబంధించిన పనులు ప్రారంభించనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పనులు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం ఎకో టూరిజం కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఔషధ, నక్షత్ర వనాలు ఏర్పాటు

కొండపైన ఔషధ వనంతో పాటు... నక్షత్రవనం ఏర్పాటు చేయనున్నారు. అడవుల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణ, ఔషధ గుణాలు తెలుసుకునేలా ఓ విజ్ఞాన కేంద్రం నిర్మిస్తారు. ఇక్కడ చారిత్రక నిర్మాణాలే కాకుండా అరుదైన వృక్షజాతులు, ఔషధ గుణాలున్న మొక్కలు కూడా ఉన్నాయి. ఈ వన సంపదను పరిశీలించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పరిశోధక విద్యార్థులు వస్తుంటారు. ఔషధ మొక్కలను గుర్తించి ప్రత్యేకంగా పార్కు ఏర్పాటు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. ఎన్నో ప్రత్యేకతలుండే మొక్కల గురించి తెలుసుకోవటమే కాకుండా ఈ ప్రాంతంలో సరదాగా గడిపేలా ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చదవండి

తుంగభద్ర పుష్కరాల్లో.. పురోహితులెవరు?

ABOUT THE AUTHOR

...view details