కరోనా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉపసభాపతి కోన రఘుపతి నేరుగా రంగంలోకి దిగారు. తన వాహనంలోనే నియోజకవర్గంలో పర్యటిస్తూ...మైక్ ద్వారా ప్రజలను హెచ్చరించారు. కరోనా వ్యాప్తి, కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పించారు. వైరస్ బారీనపడితే ఏం చేయాలి తదితర అంశాలను వివరించారు. ప్రజల్లో అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయటం ద్వారానే కరోనా నియంత్రించగలమని ఉపసభాపతి కోన రఘుపతి తెలిపారు.
కరోనా నియంత్రణపై ఉపసభాపతి కోనరఘుపతి ప్రచారం
కరోనా నియంత్రణపై ఉపసభాపతి కోనరఘుపతి ప్రచారం నిర్వహించారు. తన వాహనంలోనే ఉండి మైక్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
ఉపసభాపతి కోన రఘుపతి కరోనా అవగాహన