ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం' - Hospital works started at pittavanipalem

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో సామాజిక ఆరోగ్య కేంద్రం విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

kona raghupathi inagurated hospital works at pittalavanipalli
శిలాఫలకం ప్రారంభించిన ఉపసభాపతి

By

Published : Nov 16, 2020, 8:19 PM IST

గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో సామాజిక ఆరోగ్య కేంద్రం విస్తరణ పనులకు ఉపసభాపతి కోన రఘుపతి భూమిపూజ నిర్వహించారు. ఏడు కోట్ల రూపాయలతో అదనపు గదులు నిర్మించనున్నట్లు కోన రఘుపతి తెలిపారు. సీఎం జగన్ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యశ్రీ ద్వారా 2.484 రకాల వ్యాధులకు ఉచిత చికిత్స అందిస్తున్నారని చెప్పారు.

తీర ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ వైద్యశాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details