కరోనా నుంచి కోలుకున్న ఉపసభాపతి కోన రఘుపతి డిశ్ఛార్జి అయ్యారు. దాదాపు పదకొండు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న కోన రఘుపతికి.. 2 రోజుల క్రితం నిర్వహించిన కొవిడ్ పరీక్షలలో నెగిటివ్ రావడంతో వైద్యులు ఆయన్ని డిశ్ఛార్జి చేశారు. ఎన్నారై వైద్యులు మంచి చికిత్స అందించారని ఉపసభాపతి చెప్పారు.
తనకు చాలా మంది హైదరాబాద్ లో చూపించుకోవాలని సలహాలు ఇచ్చారని.. మన రాష్ట్రంలో వైద్యులపై నమ్మకం ఉందని..అందుకే ఇక్కడే చికిత్స తీసుకున్నాని తెలిపారు. వైద్యులకు, నర్సులకు ఉపసభాపతి కృతజ్ఞతలు తెలియజేశారు.