Komuravelli Mallikarjuna Swamy Kalyanam : సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో అంగరంగ వైభవంగా మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం జరిగింది. బృహన్మఠాధీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో ఈ వేడుకలను నిర్వహించారు. బలిజమేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లికార్జునుడు మనువాడాడు. కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారికి బంగారు కిరీటాన్ని కానుకగా అందించారు.
వైభవంగా మల్లన్న కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు - Komuravelli Mallanna jatara 2022
Komuravelli Mallikarjuna Swamy Kalyanam : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లన్న స్వామి మనువాడారు. కల్యాణ మహోత్సవానికి .. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మల్లికార్జునుడికి బంగారు కిరీటాన్ని కానుకగా అందించారు.
![వైభవంగా మల్లన్న కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు Komuravelli Mallikarjuna Swamy Kalyanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17239698-633-17239698-1671345171544.jpg)
అంగరంగ వైభవంగా మల్లన్న కల్యాణోత్సవం
మల్లికార్జునస్వామి కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు స్వామి వివాహాన్ని కన్నులపండువగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణ వేడుకను మంత్రి హరీశ్‌రావుతో పాటు మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర ప్రజాప్రతినిధులు భక్తి పారవశ్యంతో తిలకించారు.
ఇవీ చదవండి: