ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AICC: ఏఐసీసీ షోకాజ్​ నోటీసుకు సమాధానం ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి - ఆంధ్రప్రదేశ్ వార్తలు

Komatireddy Venkatareddy: ఏఐసీసీ ఇచ్చిన షోకాజ్​ నోటీసులకు కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. మునుగోడు ఉపఎన్నికలో తన తమ్ముడు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డికి ఓటువేయాలనే ఆడియో టేప్​ వైరల్​ కావడంతో ఏఐసీసీ ఈ నోటీసులను జారీ చేసింది. అయితే తాను ఏమి సమాధానం ఇచ్చారో తెలియాల్సి ఉంది.

Komatireddy Venkatareddy
Komatireddy Venkatareddy

By

Published : Nov 4, 2022, 6:21 PM IST

Komatireddy Venkatareddy replied to notices by AICC: కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలకు ఫోన్​ చేసి భాజపా అభ్యర్థి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డికి ఓటు వేయాలని ఒత్తిడి తీసుకువచ్చారనే అభియోగంపై ఏఐసీసీ షోకాజ్​ నోటీసుకు భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. గత నెల 22న వెంకటరెడ్డికి షోకాజ్​ నోటీసులు ఇచ్చిన ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఈనెల 1వ తేదీ వరకు గడువు విధించింది. అయితే ఆ సమయానికే వెంకట్​రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లారు. పదిరోజుల తరవాత విదేశం నుంచి తిరిగి వచ్చిన తరవాత తన సమాధానాన్ని సీల్డ్​ కవర్​లో పంపించినట్లు ఆయన వెల్లడించారు.

ఆడియో వైరల్‌: తరచూ కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఫోన్‌ చేసి భాజపా అభ్యర్థి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డికి ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు వెంకట రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆధారాలేం లేకపోవడంతో ఏఐసీసీ నాయకత్వం వేచి చూసింది. 15రోజుల క్రితం కిందట మునుగోడుకు చెందిన జబ్బార్‌ అనే వ్యక్తికి ఫోన్‌ చేసి తన తమ్ముడికి ఓటు వేయాలని సూచించారు. ఇదే ఆడియో బయటకు వచ్చి వైరల్‌ అయ్యింది. ఆ మరుసటి రోజు వెంకట్​రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన మరోసారి మునుగోడులో కాంగ్రెస్‌ను బలహీన పరిచేలా చేసింది.

ఈ రెండు అంశాలను రాష్ట్ర కాంగ్రెస్‌ ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. విషయాన్ని పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి పార్టీ షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. పది రోజుల్లోపు సమాధానం ఇవ్వకపోతే తదుపరి పార్టీపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పుడు కోమటిరెడ్డి సమాధానం ఇవ్వడంపై సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే ఈ సమాధానంపై క్రమశిక్షణ కమిటీ స్పందన వచ్చాకే ఈ వివాదానికి తెరపడనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details