Komatireddy Venkat Reddy Viral Video: మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తాను ప్రచారం చేసినా.. ప్రయోజనం లేదని అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్.. తెరాస, భాజపాలను తట్టుకోవటం కష్టమని వ్యాఖ్యానించారు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల వేళ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి.. అక్కడి అభిమానులతో తన అంతరంగాన్ని పంచుకున్నారు.
మునుగోడు ఫలితాలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్ - Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మునుగోడులో ప్రచారం చేసినా.. ప్రయోజనం లేదని అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్.. తెరాస, భాజపాలను తట్టుకోవటం కష్టమని వ్యాఖ్యానించారు. మెల్‌బోర్న్‌లో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులతో మునుగోడు ఎన్నికలు, ప్రస్తుత పరిణామాలపై వెంకట్‌రెడ్డి ముచ్చటించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
![మునుగోడు ఫలితాలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్ Komatireddy Venkat Reddy Viral Video](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16718886-913-16718886-1666422949870.jpg)
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మునుగోడులో తాను ప్రచారం చేసినా 10 వేల ఓట్లు వస్తాయేమో కానీ గెలిచే అవకాశాల్లేవని కోమటిరెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారు. మెల్‌బోర్న్‌లో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులతో మునుగోడు ఎన్నికలు, ప్రస్తుత పరిణామాలపై వెంకట్‌రెడ్డి ముచ్చటించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇవీ చూడండి..