లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారికి వినూత్నంగా శిక్ష విధిస్తున్నారు గుంటూరు జిల్లా కొల్లూరు ఎస్ఐ ఉజ్వల్ కుమార్. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతూ...కరోనా వ్యాప్తికి కారణమవుతున్న వారికి సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. నేను మూర్ఖుడ్ని, నేను మాస్కు పెట్టుకోను, పనీపాటా లేకుండా రోడ్లమీద తిరిగి కరోనా వైరస్ వ్యాప్తి చేస్తాను, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను అనే బోర్డు పెట్టించారు. నిబంధనలు బేఖాతరు చేసి తిరుగుతున్న వారిని సెల్ఫీ పాయింట్ దగ్గర ఎస్ఐ ఉజ్వల్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు. అనంతరం మాస్కులు లేకుండా బయట తిరిగే వారిని దేవుళ్ళుగా భావించి వారికి హారతి పట్టి...శానిటైజర్‌తో చేతులు కడిగించారు ఎస్ఐ.
లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే...సెల్ఫీ తీసుకోండి..! - kolluru si ujjwalkumar different panishment in people
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి... రోడ్ల పైకి వచ్చే వారికి సెల్ఫీ శిక్ష విధిస్తున్నారు గుంటూరు జిల్లా కొల్లూరు ఎస్ఐ ఉజ్వల్ కుమార్.
![లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే...సెల్ఫీ తీసుకోండి..! kolluru si ujjwalkumar different panishment in people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6988497-691-6988497-1588160415285.jpg)
కొల్లూరు ఎస్ఐ ఉజ్వల్ కుమార్