ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తా: కోడెల శివరాం - 4 నుంచి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు

నరసరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపించిన నాయకుడు కోడెల అని  తనయుడు కోడెల శివరామ్ అన్నారు. చంద్రబాబు ఆదేశాలే మాకు శిరోధార్యమన్న ఆయన.. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

kodela-sriram-comments

By

Published : Sep 30, 2019, 6:09 PM IST

కోడెల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం:తనయుడు శివరాం
గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన కోడెల సంస్మరణ సభలో ఆయన కుమారుడు శివరామ్ తన తండ్రి సేవలను గుర్తు చేసుకున్నారు . తమ కుటుంబానికి అండగా ఉంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు అండతో కోడెల శివప్రసాదరావు ఎన్నో మంచి పనులు చేశారన్నారు. నరసరావుపేటను అభివృద్ధి బాటలో తీసుకెళ్లిన నాయకుడు కోడెల అన్నారు. తమ తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడే ఎన్నో దాడులు ఎదుర్కొన్నారన్న శివరామ్... అభివృద్ధి మంత్రంతోనే వాటన్నింటిని తిప్పికొట్టారన్నారు. ఓట్ల కోసం కాకుండా అభివృద్ధే లక్ష్యంగా కోడెల పని చేశారని గుర్తు చేశారు. మాకు పదవులతో పని లేదని..కార్యకర్తలకు అండగా ఉంటే చాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆదేశాలు మాకు శిరోధార్యమన్న ఆయన.. తన తండ్రి ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details