ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం కావాలని జగన్​ అత్యాశ పడుతున్నారు: కోడెల - ap elections 2019

రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం ఉంది. ఈ రాష్ట్రం, ప్రజలపై నమ్మకం లేని జగన్​కు ఓటేస్తే.. ఏపీకి ద్రోహం చేసిన భాజపాకు ఓటు వేసినట్లే. రాష్ట్ర భవిష్యత్ కోసం తెదేపాను గెలిపించండి. - సత్తెనపల్లి ఎన్నికల ప్రచారంలో సభాపతి కోడెల

సత్తెనపల్లిలో సభాపతి కోడెల ప్రచారం నిర్వహించారు.

By

Published : Mar 23, 2019, 6:54 PM IST

సత్తెనపల్లిలో సభాపతి కోడెల ప్రచారం నిర్వహించారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి, సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రచారం ప్రారంభించారు. తొలుత మండలంలోని గుజ్జర్లపూడిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం, రాష్ట్ర ప్రజలపై నమ్మకం లేని జగన్... ముఖ్యమంత్రి కావాలని అత్యాశ పడుతున్నారని ఆక్షేపించారు. జగన్​కు ఓటేస్తే... రాష్ట్రానికిఅన్యాయం చేసిన భాజపాకు ఓటు వేసినట్లే అని అన్నారు. భావి తరాల కోసం ప్రజలు ఆలోచించి ఓటు వేయాలనివిజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details