తెదేపా అంటేనే బీసీలు : కోడెల - guntur
రాష్ట్రాభివృద్ధికి తెదేపా ఎల్లప్పడూ కృషి చేస్తుందని సభాపతి కోడెల అన్నారు. గుంటూరు జిల్లా నరసారావుపేటలోని 33వార్డులో రజకుల కళ్యాణ మండపానికి ఆయన శంఖుస్థాపన చేశారు.

assembly speaker
గుంటూరు జిల్లా నరసారావుపేటలోని 33వార్డులో రజకుల కళ్యాణ మండపానికి సభాపతి కోడెల శివప్రసాద్ శంఖుస్థాపన చేశారు. తెలుగుదేశం అంటే బీసీలని...వారి అభ్యున్నతికి అప్పటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. స్త్రీలకు, పురషులకు వివిధ ఆదాయ మార్గాలను చూపించామన్నారు. భవన నిర్మాణానికి 25లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించానని తెలిపారు.
రజకులు కళ్యాణ మండపానికి శంఖుస్థాపన చేస్తున్న సభాపతి కోడెల