సీఎం జగన్ నిర్ణయాల వల్ల ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వటం మానేసిందని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు అన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని వైకాపా చెప్పుతుంటే.. ప్రపంచబ్యాంకు రాష్ట్రానికి కేంద్రమే నిధులివ్వొద్దని ఎందుకు చెబుతుందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధిస్తాం అంటూ జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎప్పుడు చూసినా గత ప్రభుత్వం అవినీతి అంటూ ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు కావాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలపై సమీక్షలంటూ పారిశ్రామికవేత్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఇది సరికాదని చెప్పారు. సచివాలయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నవారు అసెంబ్లీలో ఈ విషయాలపై చర్చించాలంటూ ఆయన అన్నారు. ఇసుక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వారందరికీ తెదేపా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపాలి: కోడెల - kodela
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్లో సుమారు లక్ష కోట్ల వరకు లోటు ఉందని మాజీ సభాపతి కోడెల శివ ప్రసాద్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు లేకపోవటం వల్ల ఆదాయం తగ్గిపోయిందన్నారు.
కోడెల ప్రెస్ మీట్