ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధూళిపాళ్ల అరెస్ట్ కుట్రలో భాగమే: కోడెల శివరామకృష్ణ - తెదేపా నేత కోడెల శివరామకృష్ణ

స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డెయిరీని నిర్వీర్యం చేసి.. పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్​తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారని.. డాక్టర్. కోడెల శివరామకృష్ణ ఆరోపించారు. సంగం డెయిరీని దెబ్బతీసి అమూల్​కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే.. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

kodela shiva rama krishna fires on ycp over arresting dhulipalla narendra
kodela shiva rama krishna fires on ycp over arresting dhulipalla narendra

By

Published : Apr 23, 2021, 7:51 PM IST

సంగం డెయిరీని దెబ్బతీసి అమూల్​కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే.. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారని తెదేపా నేత డాక్టర్ కోడెల శివరామకృష్ణ ఆరోపించారు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డెయిరీని నిర్వీర్యం చేసి.. పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్​తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసు బలగాలతో భారీగా మోహరించి భయబ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.

అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని వంటి నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కోడెల ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. దూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details