ETV Bharat / state
కేంద్రం మోసం చేసింది: సభాపతి కోడెల - కోడెల శివప్రసాద్
ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో చేస్తున్న ధర్మపోరాట దీక్షకు.. శాసనసభాపతి కోడెల గుంటూరులో దీక్షకు దిగి మద్దతు తెలిపారు.
కోడెల శివప్రసాద్
By
Published : Feb 11, 2019, 4:10 PM IST
| Updated : Feb 11, 2019, 4:37 PM IST
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు... శాసనసభాపతి కోడెల శివప్రసాద్ రాష్ట్రం నుంచే సంఘీభావం తెలియజేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. Last Updated : Feb 11, 2019, 4:37 PM IST