అసెంబ్లీ ఫర్నీచర్ కేసుపై హైకోర్టులో వాదనలు -విచారణ 29కి వాయిదా - కోడెల శివప్రసాదరావు పిటిషన్
హైకోర్టులో కోడెల శివప్రసాదరావు పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు. తన వద్ద అసెంబ్లీ ఫర్నీచర్‌ను తీసుకెళ్లేలా అధికారులను ఆదేశించాలంటూ మాజీ సభాపతి కోడెల వేసిన పిటిషన్‌పై నేడు విచారించిన ధర్మాసనం విచారణను తిరిగి ఎల్లుండికి వాయిదా వేసింది.
తన వద్ద ఉన్న అసెంబ్లీ ఫర్నీచర్‌ను అధికారులు తీసుకెళ్లేలా ఆదేశించాలని కోరుతూ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ తీసుకెళ్లాలని గతంలోనే లేఖ రాసినా...అధికారులు పట్టించుకోలేదని,ఇప్పుడు కేసులు పెట్టడం సరికాదని కోడెల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.వాదనలు విన్న న్యాయమూర్తి....అసలు సభాపతి కార్యాలయంలో ఏయే వస్తువులు కనబడటంలేదో పూర్తివివరాలతో ప్రమాణ పత్రం దాఖలుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.దీనిపై తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు.మరోవైపు కోడెల,అతని తనయుడు శివరామకృష్ణపై ఉన్న కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్‌ల విచారణను30వ తేదీకి వాయిదావేశారు.