నిలకడగానే కోడెల ఆరోగ్యపరిస్థితి - sivaprasad
మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. గుంటూరులోని శ్రీలక్ష్మి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి నిన్న రాత్రి కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ...ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరారు. గుంటూరులోని శ్రీలక్ష్మి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు వ్యవహారంతో పాటు సత్తెనపల్లిలోని తన కార్యాలయంలో చోరీ ఘటనపై ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత సిబ్బంది …కొత్తపేటలోని తన అల్లుడికి చెందిన ఆసుపత్రికి తరలించారు. కోడెలను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కోడెల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కోడెల బావమరిది అంజయ్య తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చి వైద్యం అందిస్తున్నారని తెలిపారు.