సత్తెనపల్లిలో కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మీ ఎన్నికల ప్రచారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సభాపతి కోడెల శివప్రసాదరావు కుమార్తె పూనాటి విజయలక్ష్మీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు, యువతులతో కలసి ప్రచారం చేపట్టారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ పై నడుస్తూ ఓట్లను అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధికి కోడెల ఎంతో కృషి చేశారని ఆమె అన్నారు. సత్తెనపల్లిలోని పలు వార్డుల్లో కోడెల శివ ప్రసాదరావు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్నికల ప్రచారానికి ఎన్నారైలు రావడం మంచి పరిణామమని అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగేలా శాంతి భద్రతలు అదుపులో ఉంచామని తెలిపారు.
ఇవి చూడండి...