గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ జరగనుంది. ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ మేరకు ఏర్పాట్లును... జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పరిశీలించారు. మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంస్మరణ సభకు హాజరవుతారని నేతలు తెలిపారు. పల్నాడుతో పాటు జిల్లాకు చెందిన వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు కార్యక్రమానికి వస్తారని వెల్లడించారు. కోడెల మరణం పార్టీకి తీరని లోటన్న నేతలు... ఆయన బలవన్మరణానికి వైకాపా రాక్షస పాలనే కారణమని మండిపడ్డారు.
నరసరావుపేటలో నేడు కోడెల సంస్మరణ సభ - నరసరావుపేటలో కోడెల సంస్మరణ సభ
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఇవాళ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ జరగనుంది. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సభకు హాజరవుతారని జిల్లా పార్టీ నేతలు తెలిపారు.
నరసరావుపేటలో నేడు కోడెల సంస్మరణ సభ