ఏపీ మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ వాణిజ్య వ్యాపార స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. తొలుత కోడెల చిత్రపటానికి పలువురు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం కోడెల చేసిన సేవలను, వ్యక్తిగతంగా కోడెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కోడెల సంస్మరణ సభ నిర్వహించారు. గ్రామంలో ఆయన చేసిన అభివృద్ధిని తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
'కోడెల సంస్మరణ సందర్భంగా సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో అన్నదానం' - ఎన్టీఆర్
ఏపీ మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ సందర్భంగా సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కోడెలతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
కోడెల సంస్మరణ సందర్భంగా సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో అన్నదానం