రాష్ట్ర ప్రజలకు దివంగత నేత, మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు చేసిన సేవలు ప్రశంసనీయమైనవని నరసరావుపేట తెదేపా పట్టణ ఇంఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో కోడెల 73వ జయంతి వేడుకలను చదలవాడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ సభాపతి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు రక్తదానం చేశారు. కరోనా బాధితుల కోసం నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు ఆసుపత్రిని క్వారంటైన్ కేంద్రానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తనయుడు శివరాం హైదరాబాద్లో తెలిపారు.
నరసరావుపేటలో ఘనంగా కోడెల జయంతి - kodela birthday latest news
నరసరావుపేటలో మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు 73వ జయంతి వేడుకలను తెదేపా పట్టణ ఇంఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. తెదేపా కార్యాలయంలో కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
నరసరావుపేట తెదేపా కార్యాలయంలో కోడెల జయంతి వేడుకలు