ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీజీహెచ్​లో కిడ్నీ శస్త్రచికిత్సలు పునఃప్రారంభమెప్పుడు? - LATEST GGH KIDNEY OPERATIONS

గుంటూరు సర్వజనాస్పత్రిలో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆరు నెలలుగా ఆపరేషన్లు నిలిచిపోవడంతో పేదలకు అరుదైన వైద్యసదుపాయం దూరమైంది. సాంకేతిక సమస్యలే కారణమని జీజీహెచ్ వైద్యులు చెబుతున్నారు.

జీజీహెచ్​లో కిడ్నీ శస్త్రచికిత్సలు పునఃప్రారంభమెప్పుడు?
జీజీహెచ్​లో కిడ్నీ శస్త్రచికిత్సలు పునఃప్రారంభమెప్పుడు?

By

Published : Dec 13, 2019, 10:19 AM IST

ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలతో ఖర్చయ్యే కిడ్నీ మార్పిడి శస్తచికిత్సలు జీజీహెచ్​లో 2016 నుంచి చేసేవారు.ఇప్పటివరకు ఇరవై ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. కానీ ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్​లలో సరైన సదుపాయాలు లేక ఆరు నెలలుగా మూత్రపిండాల శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఈ సమస్యపై ఇటీవల వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్యాలయ సమావేశంలో... రోగులు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ థియేటర్లు కేటాయించాలని కోరారు. సర్జరీ తర్వాత రోగికి చికిత్స అందించేలా ఐసోలేషన్ వార్డును కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆపరేషన్లు చేయడానికి తాము సిద్ధమేనని.... సదుపాయాలు సమకూరితే మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలను మళ్లీ పునరుద్ధరిస్తామని జీజీహెచ్ వైద్యులు చెబుతున్నారు. రోగుల ఇబ్బందుల దృష్ట్యా ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

జీజీహెచ్​లో కిడ్నీ శస్త్రచికిత్సలు పునఃప్రారంభమెప్పుడు?

ABOUT THE AUTHOR

...view details