Kidnap: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద కిడ్నాప్ కలకలం రేగింది. విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన భక్తులు ఆదివారం అమ్మవారి దర్శనానికి వచ్చిన సమయంలో.. కొందరు యువకులు రెచ్చిపోయారు. కుమారుడిని ఓ దెబ్బేసిన మజ్జి దుర్గారావు అనే వ్యక్తితో.. పిల్లాడిని ఎందుకు కొట్టావంటూ గొడవకు దిగి, అతడిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి బంధువులు అక్కడికి రావడంతో గొడవ పెద్దదైంది. వెంటనే అక్కడికి వచ్చిన కానిస్టేబుళ్లను చూసి... దుర్గారావు వెంట ఉన్న అంబటి తేజను కారులో ఎక్కించుకుని సదరు యువకులు పరారయ్యారు.
గుంటూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం - Kidnapping in Guntur district
Kidnap: గుంటూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చిన విజయవాడ భక్తులపై దాడి చేసిన యువకులు... అంబటి తేజను కారులో ఎక్కించుకుని పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు.
దీనిపై దుగ్గిరాల ఎస్సై శ్రీనివాసరెడ్డికి పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్లను ఆయన అప్రమత్తం చేయగా... తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద యువకుల కారును అడ్డగించారు. ఎస్సై అక్కడకు చేరుకుని కారులో ఉన్న యువకులను, తేజను అదుపులోకి తీసుకుని దుగ్గిరాలకు తీసుకు వచ్చారు. కారులో ఉన్న నలుగురిలో తాడేపల్లి, విజయవాడకు చెందిన వారున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని పోలీసులు చెప్పారు.
ఇవీ చదవండి: