గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరులో ఈ నెల 24న ఇంజినీరింగ్ చదువుతున్న యువతి కిడ్నాప్‌నకు గురైంది. ఈ ఘటనలో ఇంతవరకూ నిందితుడిని అరెస్ట్ చేయలేదంటూ పెదనందిపాడు రహదారిపై యువతి బంధువులు రాస్తారోకో చేపట్టారు. ఇంటి వద్ద ఉన్న యువతిని నిందితుడు నూతి అశోక్ అనే వ్యక్తి దౌర్జన్యంగా కారులో ఎక్కించుకుని వెళ్లాడని.. ఇప్పటివరకు నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని బంధువులు ప్రశ్నించారు. హోంమంత్రి మేకతోటి సుచరిత నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని.. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు అన్నవరపు కిశోర్ డిమాండ్ చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో వారు శాంతించారు.
ఇదీ చదవండి: