ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కియా' మంచి పెట్టుబడే... కానీ పెనాల్టీ కడుతున్నాం: గౌతమ్ రెడ్డి - కియా పరిశ్రమపై మంత్రి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కియా కార్ల పరిశ్రమకు వచ్చే 20 ఏళ్ల పాటు పెనాల్టీ చెల్లించాల్సి వస్తోందన్నారు. మరోవైపు కడపలోని ఈఎంసీ-3లో మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు 'యాపిల్‌' సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

minister gowtham reddy
minister gowtham reddy

By

Published : Sep 8, 2020, 6:13 AM IST

'కియా కార్ల పరిశ్రమ రూపంలో గత ప్రభుత్వం రాష్ట్రానికి మంచి పెట్టుబడే తెచ్చింది. అందుకు ఆ ప్రభుత్వానికి అభినందనలు. నాడు ఆ సంస్థకు ఇచ్చిన హామీలను ఇష్టం ఉన్నా లేకపోయినా మేం అమలు చేయాలి. ఆ కంపెనీ ఇక్కడికి వచ్చినందుకు ప్రస్తుత ప్రభుత్వం వచ్చే 20 ఏళ్ల పాటు రాయితీల రూపంలో పెనాల్టీ చెల్లించాల్సి వస్తోంది...' అని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

'కొత్త ఎలక్ట్రానిక్‌ పాలసీలో భాగంగా కడపలోని ఈఎంసీ-3లో మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు 'యాపిల్‌' సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ యూనిట్‌ ఏర్పాటైతే సుమారు 50 వేల మందికి ఉపాధి లభిస్తుంది. బల్క్‌ డ్రగ్‌ పార్కు కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో ఉంది. కరోనా పరిస్థితుల్లోనూ పరిశ్రమలకు రూ.1,100 కోట్ల ప్రోత్సాహక బకాయిలు చెల్లించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన ఎంవోయూలన్నీ కాగితాల మీదే ఉన్నాయి. 2014-19 మధ్య రాష్ట్రంలో సుమారు రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేశారు. వాస్తవంగా ఆచరణలోకి వచ్చినవి రూ.50 వేల కోట్లు కూడా ఉండవు. ఎవరైతే వెంటనే పరిశ్రమను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారో, వారికే మా ప్రాధాన్యం. ప్రతి నెలా మొదటి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం..' అని మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.


సీఎం అభినందన
సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌.. దేశంలో మొదటి ర్యాంకు సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ను పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, ఏపీఈడీబీ సీఈవో జేవీఎస్‌ సుబ్రమణ్యంలు సోమవారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని జగన్‌ అభినందించారు.

ఇదీ చదవండి

'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'

ABOUT THE AUTHOR

...view details