Hyderabad Drug Case: పుడింగ్ పబ్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్.. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పుడింగ్ పబ్‌లో రోజూ తెల్లవారుజామున 4 వరకు మద్యం, మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం 3వ తేదీ తెల్లవారుజామున పబ్ పై దాడిచేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కౌంటర్ వద్దకు వెళ్లారు.
అక్కడ ఉన్న ట్రైలలో స్ట్రాలు, టిష్యు పేపర్లు, టూత్ పిక్స్‌ను గమనించారు. అదే ట్రేలో 5 అనుమానాస్పద ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో తెల్లటి పౌడర్‌ను గమనించిన పోలీసులు స్వాధీనం చేసుకొని పరీక్షించగా కొకైన్‌గా తేలింది. 4.6 గ్రాముల కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. లాప్ టాప్, ప్రింటర్, వెయింగ్ మిషన్‌తో పాటు ప్యాకింగ్ మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ పబ్ మేనేజర్ అనిల్ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుసుకొని అతన్ని ప్రశ్నించారు. అనిల్ ఇచ్చిన సమాచారం మేరకు పబ్ నిర్వాహకుడు అభిషేక్‌ను పిలిపించారు.