కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తుది సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై నేడు కీలక నిర్ణయం వెలువడనుంది. వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను విద్యాశాఖ రద్దు చేసింది. జులై1-15 మధ్య నిర్వహించాల్సిన పరీక్షలపైనా ప్రకటన చేయాల్సి ఉంది. విశ్వవిద్యాలయ ఉపకులపతులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తదుపరి కార్యాచరణపై ఇందులో చర్చించనున్నారు.
డిగ్రీ, బీటెక్ పరీక్షలపై కీలక నిర్ణయం నేడు? - డిగ్రీ, బీటెక్ పరీక్షలపై ఏపీ కీలక నిర్ణయం
డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తుది సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశముంది. విశ్వవిద్యాలయ ఉపకులపతులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
exams in ap