Anjani Kumar Take charge as New DGP : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరించారు. మహేందర్‌రెడ్డి నుంచి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహేందర్‌రెడ్డికి వీడ్కోలు పలికిన ఉన్నతాధికారులు.. కొత్త డీజీపీగా అంజనీకుమార్‌కు స్వాగతం పలికారు. బిహార్ రాజధాని పాట్నాలో 1966 జనవరి 28న జన్మించిన అంజనీకుమార్.. పాట్నాతో పాటు దిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.
1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. పోలీస్ శాఖలో మంచి పోస్టింగులలో పని చేశారు. ఆయన పలు అవార్డులు సైతం దక్కించుకున్నారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ రెండుసార్లు అందుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసుల 500 ఏళ్ల చరిత్రపై రాసిన పుస్తకంలోనూ తన భాగస్వామ్యాన్ని అంజనీకుమార్ అందించారు. అంజనీకుమార్ 2026 జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్... సీఎం కేసీఆర్ విషెస్ సీఎంకు కృతజ్ఞతలు..:ఇదిలా ఉండగా.. బాధ్యతలు చేపట్టిన అనంతరం అంజనీకుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ప్రగతిభవన్‌లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన.. డీజీపీగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజనీకుమార్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్... సీఎం కేసీఆర్ విషెస్ రాచకొండ సీపీగా దేవేందర్‌సింగ్ చౌహాన్..:మరోవైపు రాచకొండ నూతన పోలీస్ కమిషనర్‌గా దేవేందర్‌సింగ్ చౌహాన్ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న సీపీ మహేశ్ భగవత్ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. కమిషనరేట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి రాచకొండ పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ సుధీర్ఘంగా పని చేశారు. ఆయనను ప్రభుత్వం ఇటీవల తెలంగాణ సీఐడీ డీజీగా బదిలీ చేసింది. దాంతో ఆయన స్థానంలో దేవేందర్‌సింగ్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్... సీఎం కేసీఆర్ విషెస్ ఇవీ చదవండి: